మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

-

ఉత్తరప్రదేశ్: మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్యాణ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటి నుంచే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం కల్యాణ్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలోని క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగంలో వైద్యం అందిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, న్యూరో ఆటోలజీ నిపుణులు కల్యాణ్ సింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. కర్తపోటు, గుండెపోటు కూడా రావడంతో వైద్యం చాలా క్రిటికల్‌గా ఉందని వైద్యులు అంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి కల్యాణ్ సింగ్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

కాగా కొంతకాలం క్రితం కల్యాణ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్ ప్రస్తుతం యూపీలో రాష్ట్రమంత్రిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news