యూపీలో నిన్న జరిగిన ఘటనలో 4 రైతులతో సహా 9 మంది మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో పాటు కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస నేతలు బాధితులకు అండగా ఘటన జరిగిన లఖీంపూర్ ఖేరీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై యూపీ అట్టుడుకుతున్న వేళ రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. మరణించిన, గాయపడిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వ ఒప్పుకుంది. మరణించిన రైతులకు కుటుంబాలకు రూ. 45 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం హమీ ఇచ్చింది. చనిపోయిన 9 మందిలో ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు. నిన్న లఖీంపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హజరయ్యారు. ఈ క్రమంలోనే సాగు చట్టాలు రద్ధు చేయాలని రైతులు నిరసన వ్యక్తం చేసే క్రమంతో కాన్వాయ్ ఢీ కొని పలువురు రైతులు మరణించారు. దీంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. తాాజాగా ప్రభుత్వం పరిహారానికి ఒప్పుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణగనుంది.