లీటర్ పాలల్లో బకెట్ నీళ్ళు… స్కూల్లో 80 మంది పిల్లలకు వడ్డించారు…!

-

లీటర్ పాలల్లో బకెట్ నీళ్ళు కలిపి పిల్లలకు వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రభుత్వ బడుల్లో ఆహార నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సరే పిల్లలకు నాణ్యమైన ఆహారం మాత్రం దొరికే పరిస్థితి లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే ఆహారంలో నాణ్యత ఏ స్థాయిలో క్షీణించింది అనేది అర్ధమవుతుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని సొన్ భద్రత జిల్లాలో చోపన్ వికాస్ ఖండ్ పరిధిలోని కోటా గ్రామ పంచాయితీలోని సలయీబన్వా,

ప్రాధమిక స్కూల్ లో మొత్తం 171 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఒక లీటరు పాలను  బకెట్‌ నీళ్ళలో కలిపి 85 మంది పిల్లలకు వడ్డించారు. మధ్యాహ్నం భోజన మెనూ (ఎండిఎం) ప్రకారం “టెహ్రీ” (ఒక బియ్యం వంటకం) మరియు పాలను పిల్లలకు అందించాల్సి ఉంది. ఇక ఈ విషయం వెలుగులోకి రాగానే… స్కూలు నిర్వాహకులు విషయాన్ని దాచేందుకు ప్రయత్నించారు. అసలు 170 మంది పిల్లలూ వచ్చి ఉంటే మూడు బకెట్లలో ఆ పాలను కలిపి ఉండే వారని అక్కడి స్థానికులు అంటున్నారు.

దీనిపై ఉన్నత అధికారులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి అక్కడి ఆహారాన్ని పరిశీలించారు. వెంటనే ఆ టీచర్ ని, వడ్డించిన వారిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్ఎ) గోరఖ్నాథ్ పటేల్ మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఇక్కడ జరిగినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని ఇక ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. “పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం సరిగ్గా పొందడం లేదు. పిల్లలకు సరైన భోజనం అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. విద్యార్ధులకు మరో మార్గం లేక ఆ ఆహరం తీసుకుంటున్నారు అని ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు.

 

Read more RELATED
Recommended to you

Latest news