అవినీతిలో తెలంగాణ టాప్‌… ర్యాంక్ ఎంతంటే…

-

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అప‌కీర్తిని మూట‌గ‌ట్ట‌కుంది. అవినీతి ర‌హిత పాల‌న అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దేప‌దే చెప్పుకొస్తున్న నేప‌థ్యంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా స‌ర్వే 2019 ఫ‌లితాలు బాంబు పేల్చాయి. దేశంలో అవినీతి అత్య‌ధికంగా జ‌రుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచిన‌ట్లు ఫ‌లితాల్లో వెల్ల‌డించింది. ఇక రాజ‌స్థాన్‌ మొద‌టి స్థానంలో నిల‌వ‌డం.. ఆ త‌ర్వాతి స్థానాల్లో బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ఉ న్నాయి. అతి తక్కువ అవినీతి ప‌రులున్నా రాష్ట్రం కేర‌ళ నిల‌వ‌డం విశేషం. గోవా, ఒడిశా కూడా తక్కువ అవినీతి జాబితాలా రాష్ట్రాల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ 13వ స్థానంలో నిల‌వ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారుకు కాస్త ఊర‌ట‌నిచ్చే అంశంమేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సహకారంతో లోకల్ సర్కిల్స్ ఇండియా కరప్షన్ సర్వే -2019 ను నిర్వహించింది. ఇది స్వతంత్ర సంస్థ. స‌ర్వే బృందం మొత్తం 21 రాష్ట్రాలను అధ్యయనం చేసింది. ఇందులో 81,0000 మంది ప్రతివాదులు (ప్రజలు) పాల్గొన్న‌ట్లు వివ‌రాలు వెల్ల‌డించింది.

85,000 మంది ప్రజల నుంచి వచ్చిన 1.90 లక్షల స్పందనల ఆధారంగా రాష్ట్రాలను చాలా తక్కువ మరియు ఎక్కువ అవినీతి ప‌రులున్న రాష్ట్రాలుగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింద‌ని స‌ర్వే నిర్వ‌హాకులు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే అన్ని శాఖ‌ల్లో కాకుండా కొన్నిశాఖ‌ల్లోనే అవినీతి ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌ని కూడా తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తి రిజిస్ట్రేషన్ మరియు భూ సమస్యల విభాగాల్లో అత్యంత అవినీతి జ‌రుగుతోందంట‌. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరి స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది.

తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వేలో 5,500 మంది ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించార‌ట‌. వీరిలో 67% మంది తమ పనిని పూర్తి చేయడానికి లంచం ఇచ్చినట్లు అంగీకరించ‌డం గ‌మ‌నార్హం. అందులో 56% లంచాలు చాలాసార్లు (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) ఇచ్చామ‌ని తెలియ‌జేశారు. అదే సమయంలో, 11% మంది లంచం చెల్లించకుండా అధికారులు త‌మ‌ పని చేశారని చెప్పారు. చూడాలి స‌ర్వే త‌ర్వాతే అయినా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుని అవినీతిని క‌ట్ట‌డి చేస్తారో..?!

Read more RELATED
Recommended to you

Latest news