కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. పాముల కారణంగా వచ్చిన ఈ వైరస్ పెంపుడు జంతువులకి త్వరగా వస్తుంది. వాటి ద్వారా మనుషులకి వ్యాపిస్తోంది. అదే విధంగా మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. దగ్గు, తుమ్ములు, షేక్ హ్యాండ్ వంటి చర్యలతోనే ఎక్కువగా వస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించడంతో.. తెలంగాణలో ఒక కేసు మరియు దేశ రాజధాని ఢిల్లీలో ఒక కేసు నమోదు అయ్యాయి. అంతేకాకుండా, వందల్లో అనుమానిత కేసులు నమోదు అయ్యాయి.
ఇక కరోనా వైరస్ వస్తే దీనికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతారని చెబుతున్నారు నిపుణులు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే కొందరు మాత్రం కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఒకరు. ఇటీవల కరోనా వైరస్ గురించి కొన్ని సూచనలు తెలిపిన ఆమె.. మరో సారి ఈ వైరస్‌పై స్పందించారు. కొన్నిచోట్ల మాస్కుల లభ్యత లేకపోగా, మరికొన్ని ప్రాంతాల్లో మాస్కుల ధరలు బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైనే ఉపాసన కొణిదెల స్పందించారు.
ఈ క్రమంలోనే టిష్యూ పేపర్ తో మాస్కు ఎలా రూపొందించాలో ఎంతో సులువుగా ఉపాసనచేసి చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాపై భయం వీడి బాధ్యతతో వ్యవహరించాలి. అవసరం ఉంటేనే మాస్కు ధరించాలి. మీకు కరోనా ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు.. ఇతరులకు కరోనా సోకినట్టు అనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలి. మాస్కును తొలగించిన తర్వాత దాన్ని విధిగా చెత్తబుట్టలోనే వేయాలి’ అని వీడియోలో ఉపాసన వివరించారు.