ముగిసిన ఏపీ క్యాబినేట్‌.. సీఎం జగన్ వరాల పండ‌గ‌..

-

ఏపీ కేబినెట్ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 అంశాల‌పై ప్రధానంగా కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చ‌ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వైఎస్సార్ నవశకం కొత్త మార్గదర్శకాలకు, జగనన్న వసతి దీవెన పథకం, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర వేసింది. కొత్త పెన్షన్ కార్డులు, పెన్షన్ అర్హతల మార్పు, రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, విద్యా దీవెన కార్డుల జారీ, వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, సీఆర్డీఏలో జరుగుతున్న పనుల నిర్మాణాలపై, కొత్త బార్ పాలసీపై కేబినెట్‌లో చర్చించినట్లు సమాచారం.

ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేల ఆర్థిక సాయం, డిగ్రీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం చేయ‌నున్నారు. అలాగే వైఎస్‌ఆర్ కాపునేస్తం పథకానికి ఆమోదముద్ర వేశారు. ఈ పథకం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. టీటీడీ పాలక మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్ నవశకం సర్వేపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఆ సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయడంపై చర్చించారు. అలాగే, సంక్షేమ కార్డుల జారీకి సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news