ఉప్పెన తమిళ రీమేక్.. స్టార్ హీరో కొడుకు అరంగేట్రం..?

Join Our Community
follow manalokam on social media

కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా రారా అని అనుమానాలు ఎదురైన సందర్భంలో మంచి సినిమా పడితే సినిమాకి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రేక్షకుల చేత అనిపించిన సినిమా ఉప్పెన. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకూ ఏ మొదటి సినిమా హీరోకి రానటువంటి కలెక్షన్లు ఉప్పెన సినిమాకి వచ్చాయి. బేబమ్మ, ఆసి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్రితి శెట్టి, వైష్ణవ్ తేజ్, తమ నటనతో మెస్మరైజ్ చేసారు.

ఐతే ఈ సినిమా ప్రస్తుతం తమిళంలోకి రీమేక్ కి వెళ్ళనుందని వినిపిస్తుంది. తమిళంలోనూ స్టార్ హీరో కొడుకు హీరోగా ఉప్పెన సినిమా రీమేక్ తో పరిచయం అవబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు. విజయ్. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఉప్పెన సినిమాతో సినిమాల్లోకి రాబోతున్నాడట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. కథ పరంగా తమిళులు ఎక్కువగా ఇష్టపడే అంశాలున్న ఉప్పెనకి రెస్పాన్స్ బాగుండే అవకాశం ఉంది. మరి ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....