యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు హవా చూపించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది.
జూన్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి.. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇక తాజాగా తుది ఫలితాలను రిలీజ్ చేసింది. 1,009 మంది యూపీఎస్సీకి ఎంపిక కాగా.. జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపికయ్యారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి