యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి అందులోని ఇతర విష పదార్థాలని బయటకి పంపుతుంటాయి. బయటకి పంపిస్తున్న దానిలో ఎలాంటి బాక్టీరియా ఉండదు. అప్పుడు బయట నుండి బాక్టీరియా మూత్రాశయంలోకి చేరితే నొప్పి కలుగుతుంది. దీన్నే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ప్రతీ ఆరుగురు మహిళలో ఐదుగురు మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళలో ఈ ఇబ్బంది మహిళలంత ఉండదు.
కారణాలు
90శాతం బ్లాడర్ ఇన్ఫెక్షన్లు ఈ కోలి అనే బాక్టీరియా వల్లనే కలుగుతాయి. శుభ్రంగా లేని టాయిలెట్లని వాడినా ఈ సమస్య ఏర్పడుతుంది. పబ్లిక్ టాయిలెట్లని ఎక్కువగా వాడే వారిలో ఈ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత పాటించకపోయినా ఈ వ్యాధిఅ బారిన పడతారు.
లక్షణాలు
- మూత్రం చాలా స్పీడ్ గా రావడం
- మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం
- ఎక్కువ సార్లు తక్కువ మూత్రం రావడం
- మూత్రం ఎరుపు రంగులో ఉండి రక్తం వస్తున్నట్టు అనిపించడం
- దుర్వాసన మరీ ఎక్కువగా ఉండడం
- నడుము నొప్పి, కాళ్ళలో నొప్పి కలగడం
తగ్గించుకునే ఇంటి చిట్కాలు
- కావాల్సినన్ని నీళ్ళు తాగడం, జ్యూసులు తాగడం చేస్తుండాలి. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన జరగడం వల్ల బాక్టీరియా బయటకి పోతుంది.
- ఈ సమస్యకి క్రాన్ బెర్రీ జ్యూస్ బాగా మేలు చేస్తుంది. పరిస్థితిని అదుపులో ఉంచుతూ ఇంకా సీరియస్ కాకుండా కాపాడుతుంది.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి. మూత్ర విసర్జన జరిపిన తర్వాత శుభ్రంగా ఉంచుకుంటే బయట నుండి ఎలాంటి బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది.
- శృంగారం తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయండి. ఎందుకంటే శృంగారం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.