అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి డేనియల్ పర్ల్ హత్యకేసులో నిందితులైన వారిని నిర్ధోషులు అంటు పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ తీర్పును ఖండిస్తున్న శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ సుప్రీం ఇచ్చిన తీర్పు బాధితులను అవమానించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాన్ని నవ్వులపాలు చేస్తున్నారని డేనియల్ కుటుంబ సభ్యులు దుయ్యబట్టారు.
విచారణకు అనుమతి ఇవ్వాలి..
2002లో అమేరికా పాత్రికేముడు డేనియల్ పర్ల్‌ను కిడ్నాప్‌చేసి హత్యచేసిన కేసులో ఆల్‌ఖైదా ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్ షేఖ్ ప్రధాన నిందితుడు. ఈ కేసులోక అతడికి సహకరించిన మరికొందరిపై ఉన్న నేరాలను కొట్టివేస్తూ పాకిస్థాన్ సుప్రీం కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, అక్కడి ప్రభుత్వం న్యాయసమీక్షకు ఉన్న న్యాయమార్గాలను అనుసరించాలని కోరి, ఈ కేసును విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది.
భారత్ సైతం..
పాకిస్థాన్ ఇచ్చిన తీర్పుపై ఇండియాసైతం మండిపడింది. న్యాయానికే మచ్చతెచ్చేలా తీర్పు ఉందని.. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి పాకిస్థాన్ మనస్సు ఒప్పుకోవడం లేదనడానికి ఈ తీర్పే సాక్ష్యం అంది. ప్రధాన నిందితుడైన ఒమర్ సయీద్ షేఖ్‌ను 1999 లో భారతదేశంలో జైలు నుంచి విడుదల చేశారు. అప్పట్లో ఓ విమానాన్ని హైజక్ చేయడంతో అందులోని ప్రయాణికుల దృష్ట్యా ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయగా అందులో సయీద్ ఒకడని భారత్ పేర్కొంది.
ఇదీ జరిగింది..
అమెరికాలో ప్రముఖ పత్రికైన వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు డేనియల్ పర్ల్ విలేకరిగా పని చేసేవాడు. విధుల్లో భాగంగా పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తించే క్రమంలో అక్కడి ఉగ్రవాద ఐఎస్‌ఐ అల్‌ఖైదాకు ఉన్న సంబంధాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. డేనియల్ పర్ల్ గురంచి తెలుసుకున్న ఒమర్ సయీద్ షేఖ్æ మరి కొంతమందితో కలిసి పర్ల్‌ను కిడ్నాప్ చేశారు. కొన్ని రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత తల నరికి హత్య చేశారు.