బ్రేకింగ్ : కరోనా చికిత్స లో తొలి టాబ్లెట్ కు అమెరికా ఆమోదం

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలలకో సారి వేరియంట్ పంజా విసురుతూ.. ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది ఈ కరోనా మహమ్మారి. ఇక అటు వ్యాక్సినేషన్ వచ్చినప్పటికీ ప్రజల్లో ఆందోళన ఏ మాత్రం తగ్గటం లేదు. ఇలాంటి తరుణంలో కరోనా చికిత్స లో తొలి టాబ్లెట్ లకు అమెరికా ఆమోదం లభించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తొలి కరోనా టాబ్లెట్ కు ఆమోదముద్ర వేసింది.

కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి ఫైజర్ సంస్థ రూపొందించిన టాబ్లెట్ల కు అనుమతి ఇచ్చింది అమెరికా. ఫాక్స్ లోవిడ్ పేరుతో వ్యవహరిస్తోన్న ఈ టాబ్లెట్ కు అనుమతులు మంజూరు చేసినట్లు ఎప్డియే బుధవారం ప్రకటన చేసింది. అమెరికాలో కరోనాపై పోరులో ఈ టాబ్లెట్ రాక విప్లవాత్మక… మార్పులు తెస్తుందని.. ఫైజర్ వారి పాక్స్ లోవిడు కరుణ మాత్ర ప్రధానం మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ టాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చని ఆసుపత్రులకు సూచనలు చేశారు.