భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో పర్యటించాలంటూ ఆహ్వానం అందిందని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రధాని మోడీకి ఆహ్వానం పంపినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ ఏడాది వేసవిలో మోదీ అమెరికా పర్యటనకు రావలసిందిగా అమెరికా అధ్యక్షుడు కోరినట్లు తెలుస్తోంది. మోడీ అమెరికా పర్యటన తేదీల విషయంలో ఇరు దేశాల నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు బైడిన్ ఇండియాకి రానున్నారు. అదేవిధంగా జూన్, జూలై నెలలో అమెరికా ప్రతినిధుల సభ సెనేట్, సెషన్ లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్ ను రూపొందిస్తామని పీఎంవో వివరించింది.