మాయిశ్చరైజర్ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. మంచి మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం వల్ల చర్మం డ్రై అయిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చలి కాలంలో మాయిశ్చరైజర్ ని ఎక్కువగా ఉపయోగించాలి. ఒకవేళ కనుక మీరు మాయిశ్చరైజర్ ఉపయోగించనట్లయితే ఈ సమస్యలు వస్తాయి.
దురదలు రావడం:
మీరు స్కిన్ కేర్ లో మాయిశ్చరైజర్ ముఖానికి ఉపయోగించినట్లయితే మంట, దురదలు వస్తాయి. ముఖ్యంగా చలి కాలం లో వచ్చే గాలి వల్ల కాస్త ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మాయిశ్చరైజర్ ని రాసుకోండి.
యాక్నీ వస్తుంది:
ఒకవేళ కనుక మీరు మాయిశ్చరైజర్ రాయకపోతే అప్పుడు మీ చర్మం డ్రైగా అయిపోతుంది. దీని కారణంగా యాక్నీ వస్తుంది. కాబట్టి ప్రతి రోజు మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకండి.
ముడతలు రావడం:
మాయిశ్చరైజర్ ని కనుక ఉపయోగించకపోతే త్వరగా మీ చర్మం ముడతలు పడిపోతుంది. చర్మం మాయిశ్చరైజర్ లేకపోవడం వల్ల డ్రైనెస్ మొదలైపోతుంది ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇలా ముడుతలకు దారితీస్తుంది.
మేకప్ లో సమస్యలు వస్తాయి:
ఒకవేళ మీరు మాయిశ్చరైజర్ ఉపయోగించన్నట్లైతే మీ చర్మం పొడిబారి పోతుంది. దీనితో మీరు మేకప్ వేస్తే అది అంటుకుపోయి ఉంటుంది. దీని ద్వారా అందం కూడా ఉండదు. మేకప్ కూడా సరిగ్గా రాదు. అలానే పెదాలు పొడిబారకుండా లిప్ బామ్ ని ఉపయోగించాలి లేదు అంటే అవి కూడా డ్రై అయిపోతూ ఉంటాయి.