కాంగ్రెస్ కు ఆర్ధిక ఇబ్బందులు…?

-

తెలంగాణలో ఉన్న సమస్యలు కాంగ్రెస్ పార్టీని రోజురోజుకి వెనక్కి లాగుతున్నాయి అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా తయారవుతున్నాయి. కార్యకర్తలను కూడా దగ్గర చేసుకునే నాయకత్వం తెలంగాణలో కనబడటంలేదు. దీనితో కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.

ఉన్న నాయకులు చాలామంది వర్గ విభేదాలు కారణంగా పార్టీ జండా మోయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ని ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వెంటాడుతున్నాయి అని అంటున్నారు. సోషల్ మీడియాలో పనిచేసే వాళ్లకు కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది.

నాగార్జునసాగర్ ఎన్నికల్లో జానారెడ్డి పెట్టుబడి పెట్టే ప్రయత్నం కాస్త గట్టిగానే చెబుతున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా కనబడింది అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఆర్థికంగా పార్టీని ప్రోత్సహించే నేతలు పెద్దగా ఎవరూ లేరు అని రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఉన్నాసరే కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news