ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వ్యవసాయం.. రైతులకు భారం తగ్గినట్లే..!

-

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయరంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో భవిష్యత్‌లో వ్యవసాయం చేయనున్నారు. ఈ నెల ఏప్రిల్ 7-8వ తేదీన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైగోవ్ ఇండియా సహకారంతో హిందూస్తాన్ యూనిలీవర్, గూగుల్ అనే అంశంపై హ్యాకథాన్ పోటీని నిర్వహించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయాలనే విషయంపై సమావేశమయ్యారు. ఈ హ్యాకథాన్‌లో హిందుస్తాన్ యూనిలీవర్, గూగుల్, కేంద్రప్రభుత్వం కలిసి పని చేయనున్నాయి.

AI-farming-india
AI-farming-india

ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.. వ్యవసాయ నిపుణుల సహకారంతో రైతుల పంటపొలాల సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పరిష్కారం చూపడం. దీని ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు మార్కెట్, ఇన్‌పుట్, ఔట్‌పుట్, డేటా, రుణం, ఇన్సూరెన్స్, సలహాలు, సూచనలు వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని, పంటల దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు హిందుస్తాన్ యూనిలివర్, గూగుల్ నీటితో అనుసంధానించబడిన అనేక రంగాలలో అవకాశాలను కనుగొనడానికి ప్రయత్నించాయి. సాంకేతిక నిపుణులు, సామాజిక వ్యవస్థాపకుల సాయంతో ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకుని రైతులకు సలహాలు ఇవ్వనున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పంటలకు సంబంధించిన డేటా సేకరణ, ఏ సమయాల్లో మందుల పిచికారీ చేయడం, నేలలో ఎంత సారం ఉంది, ఏ నేలల్లో ఏఏ పంటలు పండుతాయి, పని భారాన్ని ఎలా తగ్గించుకోవాలనుకునేది గూగుల్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. భారతదేశ వ్యవసాయరంగంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఆహార ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ ఎలా ఉపయోగపడుతుంది..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాతావరణంలో కాలుష్యం స్థాయిని కనుగోనవచ్చు. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఏ కాలంలో ఎలాంటి పంటలు పండించాలనే విషయాన్ని రైతులకు పూర్తిగా అందిస్తుంది. అలాగే మట్టికి సంబంధించిన నాణ్యత, మట్టిలో నీటిశాతం, ఎలాంటి రకమైన మట్టి, ఈ మట్టిలో ఎలాంటి పంటలు పండుతాయనే విషయాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలు వేసిన తర్వాత పంటకు సంబంధించిన సమస్యలు, రోగాల నివారణ, రసాయన పిచికారీల గురించి, పంట నాణ్యత గురించి వంటివి తెలుసుకోవచ్చు. దీంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం అందిస్తుంది. జర్మన్ స్టార్టప్ ‘పీట్ ప్లాంటిక్స్ అనే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోటోలు తీస్తే చాలు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news