పెగాసస్.. మొబైల్ ఫోన్ వాడకంపై హద్దుల్లో ఉండాలంటున్న మహారాష్ట్ర.

-

పెగాసస్ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో వాదోపవాదాలు నడిచాయి. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం, మొబైల్ ఫోన్ల వాడకంపై హద్దుల్లో ఉండాలని ఉద్యోగులకు తెలిపింది. అవసరం అయితే తప్ప మొబైల్ ఫోన్ వాడవద్దని, పని చేస్తున్నప్పుడు సోషల్ మీడియా వాడకాన్ని బాగా తగ్గించాలని కోరింది.

అవసరం అయితే టెక్స్ట్ మెసేజెస్ పంపాలని, కాల్స్ మాట్లాడడం తగ్గించాలని తెలిపింది. పనివేళల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని, దానివల్ల నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని, అలాగే ఆఫీసుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత కాల్స్ మాట్లాడేవారు బయటకి వెళ్ళి మాట్లాడడం మంచిదని సూచించారు. అలాగే ప్రజా పతినిధులు, ప్రభుత్వ అధికారుల నుండి కాల్స్ వస్తే ఆలస్యం చేయకుండా అటెండ్ చేయాలని పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news