బ్రేకింగ్ : పీసీసి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

-

తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఒక గంట క్రితం ఈ రోజు కీలక ప్రకటన చేస్తాను అంటూ మీడియాకు సమాచారం ఇచ్చిన ఆయన ఈ రోజు కాంగ్రెస్ వైఫల్యం చెందడం చాలా బాధ కలిగించిందని ఇలాంటి ఫలితాలు చూడాల్సి వస్తుందని అనుకోలేదు అని పేర్కొన్నారు.

ఇక ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కి పంపినట్లు సమాచారం. రాజీనామా లేఖలో ఆయన తాను రాజీనామా చేస్తున్నానని కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలు పెట్టాలని కోరారు. ఇక హుజూర్ నగర్ లో తన భార్య ఓటమిపాలైన అప్పటి నుంచి ఆయన తనకు పీసీసీ పదవి వద్దు అని అంటూ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. అయినా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈయననే కొనసాగిస్తూ వస్తోంది. మరి ఇప్పుడైనా అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించి మరో నేతకు అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news