యోగీ మరో కీలక నిర్ణయం…. మంత్రులు, అధికారులు హోటళ్లలో ఉండొద్దు

-

ఉత్తర్ ప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నేరస్తులకు, నిందితులకు బుల్డోజర్లతో సమాధానం చెబుతున్నాడు. మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులు యూపీలో సేఫ్ గా ఉండాలంటే జైళ్లలోనే ఉండాలనేలా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేరస్తులకు తన మార్క్ పాలన చూపిస్తున్నారు. 

ఇప్పటికే ఉద్యోగుల లంచ్ టైంను అరగంటకు తగ్గించి… సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి సుపరిపాలన అందించాలనే ఉద్దేశ్యంతో యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు యోగీ ఆదిత్యనాథ్. అధికారిక పర్యటనల్లో ఉండే మంత్రులు, అధికారులు హోటళ్లలో ఉండవద్దని.. ప్రభుత్వ గెస్ట్ హౌజ్ ల్లోనే ఉండాలంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంధువులను వ్యక్తిగత కార్యదర్శులగా నియమించుకోవద్దని ఆదేశించారు. ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులను అనుమతించవద్దని, ప్రతీ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ అమలు చేయాలని….ఏ ఫైల్ కూడా 3 రోజులకు మించి పెండింగ్ లో ఉండొద్దని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news