ప్రతీ పోలీస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్: సిఎం నిర్ణయం

-

రాష్ట్రంలో మహిళా భద్రతకు సంబంధించిన ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు.

నవరాత్రి మొదటి రోజు, మహిళల భద్రత కోసం ప్రారంభించబోయే మిషన్ శక్తిని ప్రస్తావిస్తూ… ముఖ్యమంత్రి రాబోయే నవరాత్రి రోజులను మహిళల సాధికారత కోసం అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించారు. సాధారణంగా మహిళలు తమ ఫిర్యాదులను పోలీస్ స్టేషన్లో మగ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి వేనుకాడుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళా పోలీసు సిబ్బందికి ఈ మహిళా హెల్ప్ డెస్క్‌ల బాధ్యతలు ఇవ్వనున్నారు. దీని ద్వారా మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని స్వేచ్చగా చెప్పుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news