వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి మొక్కలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
వెదురు మొక్క:
ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వెదురు మొక్క ఉంటే చాలా మంచి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసి ఆనందంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
వేప చెట్టు:
వేప చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం వేప ముక్క ఇంట్లో ఉండడం వలన పాజిటివ్ ఎనెర్జీని ఇది కలిగిస్తుంది.
మనీ ప్లాంట్:
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే అదృష్టం వస్తుంది అలానే సంపద కూడా పెరుగుతుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.
లావెండర్ మొక్క:
లావెండర్ మొక్క కూడా సమస్యలను దూరం చేస్తుంది మంచిగా ఎనెర్జీని ఇది తీసుకువచ్చి చెడుని దూరం చేస్తుంది.
పీస్ లిల్లీ:
ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.
స్నేక్ ప్లాంట్:
స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది. దీనితో ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
తులసి:
ఇంట్లో తులసి మొక్క ఉండడం వలన ఎంతో మంచి కలుగుతుంది అలానే సమస్యలు ఉండవు.
అశోక చెట్టు:
అశోక చెట్టు కూడా ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది అలానే ధనాన్ని కూడా పెంచుతుంది.