పేటీఎం క్యాష్‌బ్యాక్‌ స్కాం.. జరభద్రం!

-

కరోనా నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. ఎందుకంటే దీనివల్ల సేఫ్‌ పేమెంట్‌ అవుతుందని, చాలా వరకు ఆన్‌లైన్‌ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసేస్తున్నారు. దీనివల్ల ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగాయి. ఎక్కువ శాతం ప్రజలు టెక్నాలజీ పరంగా అవగాహన తక్కువ ఉన్నవారే వీరి వలలో పడి మోసపోతున్నారు. ప్రస్తుతం పేటీఎం క్యాష్‌బ్యాక్‌ స్కాంతో భారీగా మోసపోతున్నారు. ఈ స్కాంలో మీరు గూగుల్‌ క్రోమ్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. అందులో ‘కంగ్రాట్స్‌! మీరు పేటీఎం స్క్రాచ్‌ కార్డుకు రాండంమ్‌గా సెలెక్ట్‌ అయ్యారు’ అని వస్తుంది. పేటీఎం పై ఉన్న నమ్మకంతో చాలా మంది రెండో ఆలోచన చేయరు. లింక్‌ ఓపెన్‌ చేసేస్తారు. దీంతో పేటీఎం క్యాష్‌ ఆఫర్‌ డాట్‌ కమ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.

 

అప్పుడు మీరు రూ.2,647 క్యాష్‌బ్యాక్‌ పొందారని, వెంటనే ఆ రివార్డును పేటీఎం ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకొమ్మని ఉంటుంది. ఆ ఫేక్‌ వెబ్‌సైట్‌ కూడా అధికారిక పేటీఎం యాప్‌ మాదిరిగానే ఉంటుంది. ఒకసారి మీరు సెండ్‌ బటన్‌ నొక్కితే, మీ ఒరిజినల్‌ పేటీఎం యాప్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ‘పే ది సేమ్‌ అమౌంట్‌’ అని ఉంటుంది. కానీ, చాలా మంది అది ‘పే’ బటన్‌ అని గుర్తుకు తెచ్చుకోరు. వారు ట్యాప్‌ చేసేస్తారు. దీంతో డబ్బులు వారికి క్రెడిట్‌ అయిపోతాయి. ఒకవేళ మీ వద్ద పేటీఎం యాప్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉండకపోతే ఈ మోసం బారిన పడే ఛాన్స్‌ ఉండదు. ఇలా చాలా రకాల క్యాష్‌బ్యాక్‌లతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు మోసగాళ్లు. ఇది కేవలం మొబైల్‌ ద్వారానే జరుగుతుంది. పర్సనల్‌ కంప్యూటర్‌లో దీనికి ఆస్కారం ఉండదు.
ఒక విషయం గుర్తుంచుకోండి పేటీఎం ఇతర ప్లాట్‌ఫాంల ఆధారంగా ఇటువంటి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించదు. కేవలం పేటీఎం ఒరిజినల్‌ పేటీఎం యాప్‌లోనే ఆఫర్లను ఇస్తుంది. డైరెక్టగా మీ పేటీఎం ఖాతాలో లేదా వ్యాలెట్‌లో జమా అయిపోతుంది. ఇతర ప్లాట్‌ఫాంల నుంచి క్యాష్‌బ్యాక్‌ను కలెక్ట్‌ చేసుకొమ్మని అడగదు. గత 15 నెలలుగా దాదాపు 25 శాతం బీ2సీ స్కాంలను కేవైసీ ద్వారా గుర్తించారు. మరో 20 శాతం క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మోసాలను గుర్తించారు. ఎటువంటి అనుమనిత చర్యలు జరిగినా పేటీఎం తక్షణమే వాటిని బ్లాక్‌ చేస్తుందని ట్రస్ట్‌చెకర్‌ ఫ్రాడ్‌ డేటా ఇన్‌సైట్‌ తెలిపింది.
ఆన్‌లైన్‌లో కూడా ఎవైనా విక్రయాలు చేపట్టినా.. ‘పే’ బటన్‌ను నొక్కవద్దు. బదులుగా ‘రిక్వెస్ట్‌ మనీ’ని క్లిక్‌ చేయాలి. స్కామర్స్‌ మీరు ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీకు డబ్బు వస్తుందని ఆశ చూపుతారు. ఒకవేళ మీరు ల్యాప్‌టాప్‌ విక్రయించాలనుకుంటే స్కామర్స్‌ క్యాష్‌ ఆన్‌ డెలివరీని ఉపయోగించరు. సత్వరమే కొనుగోళు ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అలాగే వాట్సాప్‌ ద్వారా మీకు క్యూఆర్‌ కోడ్‌ను పంపుతారు. దాన్ని స్కాన్‌ చేయమని చెబుతారు. మొదటగా రూపాయిని క్యూర్‌ కోడ్‌ ద్వారా పంపిస్తామని ఆ తర్వాత పూర్తి డబ్బుల్ని పంపిస్తామని అంటారు. ఇదంగా మిమ్మల్ని నమ్మించడానికే. మీకు డబ్బు కూడా వస్తుంది. మీరు ఒక్కసారి ఆ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బంతా డెబిట్‌ అయిపోతుంది. అందుకే తెలియని క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news