సెకండ్ వేవ్‌లో ఇండియా ఎంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాం. ఇలాటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయడానికి ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. అందరికీ వ్యాక్సిన్ వేస్తే మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలం. కానీ మన దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మరో చేదు వార్త వచ్చింది.
వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు జరిపింది. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఎక్కువగా వేస్తున్న మోడెర్నా, ఫైజర్ టీకాల కంపెనీలతో మాట్లాడింది. అయితే అవికూడా సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు ఆల్రెడీ వందల మిలియన్లలో ఆర్డర్లు ఉండటంతో.. ఆ కంపెనీలు మరో రెండేళ్ల వరకు ఇండియాకు వ్యాక్సిన్లను ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. రెండేళ్ల తర్వాతనే వ్యాక్సిన్లను పంపిణీ చేస్తామని తెలిపాయి. ఇక ఫైజర్ మన దేశంలో గతంలోనే పర్మిషన్ కోరగా ఎం-ఆర్ఎన్ఏ కేటగిరీకి చెందినదంటూ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. అప్పుడు ఓకే చెప్పి ఉంటే ఇప్పుడు ఈ కొరత ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు.