ప్రస్తత కాలంలో కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. థర్డ్ వేవ్ కూడా ఈ ఓమిక్రాన్ వేరియంట్ తోనే వచ్చిందని ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఓమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు ప్రత్యేకంగా టీకాను తయారు చేయాలని ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా భారత దేశంలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు టీకాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందుకు గాను ఓమిక్రాన్ టీకా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన సీరం ఇన్ స్టిట్యూట్ కు అనుమతి ఇచ్చింది. ఓమిక్రాన్ వేరియంట్ కు ప్రత్యేక టీకా రూపొందించడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు కూడా ప్రకటించారు. కాగ సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా.. ఓమిక్రాన్ వేరియంట్ ను కట్టడికి వ్యాక్సిన్ ను తయారు చేస్తామని డీసీజీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అయితే సీరం ఇన్ స్టిట్యూట్ అభ్యర్థనను పరిశీలించిన డీసీజీఐ వ్యాక్సిన్ తయారికి అనుమతి ఇచ్చింది.