వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ఓపెనింగ్.. దర్శకుడు ఆయనే !

-

మెగా మేనల్లుడు. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్నా ఇప్పటికీ హవా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా కాక ముందు రెండో సినిమా కూడా పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ డైరెక్షన్ లో కొండపోలం అనే సినిమా చేశారు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. ఇక మూడో సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరికి అర్జున్ రెడ్డి తమిళ డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో అదే నిజం అయింది. ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో మూడో సినిమా మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news