వకీల్ సాబ్ థియేటర్ల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యమే..

-

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలకి ముందు చేస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ భారీ సంచలనాలను క్రియేట్ చేసింది. ఒక్కరోజులో మిలియన్ కి పైగా లైకులను చేరుకుని చరిత్ర తిరగరాసింది. హిందీ పింక్ సినిమాకి రీమేక్ అయినప్పటికీ ఈ స్థాయిలో ట్రెండ్ సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ మానియా ఎంతలా ఉందో ఈ విషయం ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది. ఐతే ఇది ఇప్పటితో అయిపోలేదు.

ఏప్రిల్ 9వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఓవర్సీస్ లోనే 700థియేటర్లలో విడుదల అవుతుంది. కరోనా తర్వాత ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్నీ కలుపుకుంటే దాదాపు 4వేల థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. మొత్తానికి మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ రేంజ్ లో స్వాగతం అందుతుండడం అభిమానులకి చాలా ఊపునిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news