వకీల్ సాబ్ ట్రైలర్ మొదట రిలీజ్ అయ్యేది అక్కడే..

Join Our Community
follow manalokam on social media

మూడేళ్ళుగా పవన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెర మీద చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి వచ్చే నెలలో రిలీజ్ కి రెడీగా ఉంది. బాలీవుడ్ పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పాటలు ప్రేక్షకుల్లోకి బాగా చొచ్చుకుపోయాయి.

ఇక అందరూ ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసమే. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వారికోసం ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. మార్చి 29వ తేదీన వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని వినబడుతుంది. ఈ మేరకు అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ, మార్చి 29వ తేదీన సాయంత్రం 5:30గంటలకి థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 6:30గంటలకి యూట్యూబ్ లో రిలీజ్ అవనుందట. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...