Valentines day: ప్రేయసి కి కానీ భార్యకి కానీ అందమైన బహుమతి ఇవ్వాలంటే ఇవే బెస్ట్ ఐడియాస్..!

-

వాలెంటైన్స్ డే ఇక కొన్ని రోజుల్లో రాబోతోంది. వాలెంటైన్స్ డే నాడు మీ ప్రేయసికి కానీ మీ భార్యకి కానీ సర్ప్రైజ్ ఇవ్వాలని ఉందా..? వాళ్లకి నచ్చే బహుమతి కోసం ఆలోచిస్తున్నారా ఎంత ఆలోచిస్తున్నా ఏ గిఫ్ట్ ఇవ్వాలో తట్టడం లేదా అయితే ఇది మీకోసం.

అందమైన బహుమతులని ఇప్పుడు మేము తీసుకువచ్చాము. మీ ప్రేయసికి కానీ మీ భార్యకి కానీ అందమైన బహుమతి ఇవ్వాలనుకుంటే ఈ ఐడియాస్ ఏ బెస్ట్. మరిక ఈ గిఫ్టింగ్ ఐడియాస్ ని ఇప్పుడే చూసేయండి. ఇందులో సందేహం లేదు ఖచ్చితంగా ఇవి మీ భార్యకి కానీ ప్రేయసికి కానీ నచ్చుతాయి.

పువ్వులు:

పువ్వులు ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు మంచి అందమైన ఎర్రటి గులాబీలని మీరు మీ ప్రేయసికి పంపండి లేదంటే మీ భార్యకి ఇవ్వండి. పూలు మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెబుతాయి. ఆన్లైన్లో మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా ఇంటికే పూలను పంపించేయొచ్చు.

చైన్స్ లేదా రింగ్స్ వంటివి:

ఆడవాళ్ళకి ఇవి చాలా ఇష్టం. వీటితో అందంగా అలంకరించుకుంటారు ఆడవాళ్ళూ. మీరు వాళ్ళ పేరుతో మంచి అందమైన రింగ్స్ లేదా చైన్స్ వంటివి తయారు చేయించి పంపవచ్చు లేదంటే మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసి వాళ్ల కి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు.

ఈ ప్రొడక్ట్స్ కూడా:

స్నానం చేసేందుకు లేదా షవర్ చేసేందుకు మంచి ప్రొడక్ట్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని మీరు వాళ్లకి ఇవ్వచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్, అరోమా థెరపీ, షవర్ బాత్ బాంబ్స్ వంటివి వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ ప్రేయసికి కానీ భార్యకి కానీ బహుమతి కింద ఇవ్వచ్చు.

చాక్లెట్లు:

మంచి రుచికరమైన చాక్లెట్ బాక్స్ ని మీరు మీ ప్రేయసికి కానీ భార్యకి కానీ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. హార్ట్ షేప్ లో ఉండే చాక్లెట్లు కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు దీనితో పాటుగా మీరు అందమైన ఉత్తరాన్ని రాసి పంపవచ్చు. వీటిని పంపితే కచ్చితంగా మీ భార్య లేదా మీ ప్రేయసి ఫిదా అయిపోతారు. సందేహమే లేదు కావాలంటే ఈ వాలెంటైన్స్ డే కి ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news