తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది.
పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపించలేదు. వంశీకి వ్యక్తిగతంగా ఇమేజ్ వున్న నేపథ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుందని కొంతమందిలో అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా సరే నాయకత్వం సమర్థవంతంగా లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన సరే పార్టీ మాత్రం ముందడుగు వేయలేకపోతున్నది.
పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా పార్టీని వదిలి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బాపులపాడు మండలం లో చాలామంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పని చేసే నాయకులను ప్రత్యేకంగా ఎవరూ కనపడలేదు. వల్లభనేని వంశీకి భయపడి కొంతమంది నేతలు బయటకు రావడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్చార్జి తో పాటుగా నియోజకవర్గంలో కొన్ని మార్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు.