వంశీని నియోజకవర్గం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారా.. అసలు ఏం జరిగింది..?

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారాలని నిర్ణయం వెనుక ఫ్యాక్షన్ గొడవలే కారణం అంటున్నారు పరిశీలకులు. వంశీకి గతంలో ఉన్న చరిత్రే ఆయన్ను ఇబ్బంది పెడుతుందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. గతంలో ఒకసారి జగన్ ను వంశీ ఆలింగనం చేసుకున్నారు… అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు గన్నవరం నుంచి అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయిన వంశీ.

2019 ఎన్నికల్లో వరుసగా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ఇప్పుడు ఇది పక్కన పెడితే… ఆయన పార్టీ మారతాను అంటూ ఒక కీలక ప్రకటన చేస్తూ టీడీపీ నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. అసలు ఉన్నపళంగా వంశీ టీడీపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే… ఆయనకు, టీడీపీ కి చెందిన ఒక దివంగత మాజీ మంత్రికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయనతో పాటు కలిసి వంశీ ఆయన జిల్లాలోనే ఉండే వారు. అప్పట్లో పలు ఫ్యాక్షన్ గొడవల్లో కూడా వంశీ హస్తం ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే.

vallabhaneni vamsi mohan quit tdp
vallabhaneni vamsi mohan quit tdp

1999 తర్వాత జరిగిన కొన్ని హత్యల్లో కూడా వంశీ హ్యాండ్ ఉంది అని వైసీపీ కి చెందిన మహిళా నేత ఒకరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తూ ఆయన్ను పార్టీలోకి చేర్చుకోవద్దని జగన్ ని కోరారు. ఒక రెండు వర్గాల నుంచి ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయని సమాచారం. అందుకే ఆత్మరక్షణ కోసం వంశీ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయని సమాచారం. అందుకే జగన్ అండ కోసం వంశీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news