BREAKING NEWS: వనమా రాఘవ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్ట్.

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. నిందితుడు రాఘవ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్ట్ కోట్టేసింది. గతంలో కూడా కొత్తగూడెం కోర్ట్ కూడా వనమా రాఘవకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

తెలుగు రాష్ట్రాల్లో పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలన కలిగించింది. రామక్రిష్ణతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో చనిపోయారు. ఆస్తి వివాదంలో సెటిల్మెంట్ చేయడానికి వచ్చిన వనమా రాఘవ.. తన భార్యను పంపాల్సిందిగా కోరినట్లు బాధితుడు రామక్రిష్ణ ఆరోపించాడు. ఆసమయంలో బాధితుడు రామక్రిష్ణ సెల్ఫీ వీడియో వైరల్ అయింది.  రాఘవ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని కోరాయి. టీఆర్ఎస్ పార్టీ వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ప్రస్తుతం హైకోర్ట్ బెయిల్ నిరాకరించడంతో రిమాండ్ లోని ఉండాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news