ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం కాచుకోండి..వరద బాధితుల ఫైర్ !

-

జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఈ వరద సాయం నిలిపివేత పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిల్చున్నామని రేపటి కోసం టోకెన్ తీసుకుంటామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల నుంచి పనులన్నీ పక్కన పెట్టి మీసేవ చుట్టూ తిరిగామని, ఎన్నికల తర్వాత డబ్బులు ఇస్తామని అంటే ఎలా నమ్ముతాం ? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని వారు బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news