NBK107 : బాలకృష్ణ సినిమాలో జయమ్మ..ఫస్ట్ లుక్ రిలీజ్

-

నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో క్రాక్ విలన్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్లు కూడా వదిలింది గోపిచంద్ మలినేని టీం. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కు మంచి పేరు రావడంతో… గోపీచంద్ మలినేని ఆమెను ఈ సినిమాలోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్ డేట్ తో… బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news