బిగ్‌బాష్ లీగ్‌పై క‌రోనా ఎఫెక్ట్.. మ‌రో ప్లేయ‌ర్‌కు పాజిటివ్

-

బిగ్ బాష్ లీగ్ ఆడిన ఆసీస్ ఆట‌గాళ్లను కరోనా వైర‌స్ వెంటాడుతుంది. బిగ్ బాష్ లీగ్ లో ముఖ్యంగా మెల్ బోర్న్ స్టార్స్ జ‌ట్టును కరోనా ప‌ట్టి పీడిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది ప్లేయ‌ర్స్, సిబ్బందికి క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ అయింది. తాజా గా మెల్ బోర్న్ స్టార్స్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండ‌ర్ గ్లెన్ మాక్స్ వెల్ కు క‌రోనా వైర‌స్ సోకింది. తాజా గా మాక్స్ వెల్ యాంటీ జెన్ ప‌రీక్ష చేసుకున్నాడు. అందులో మాక్స్ వెల్ కు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

ఇప్ప‌టికే మెల్ మెర్న్ స్టార్స్ జ‌ట్టుకు చెందిన మార్క‌స్ స్టోయినిస్, ఆడం జంపా, నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ క‌రోనా బారీన ప‌డ్డారు. అయితే వీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఐసోలేష‌న్ లో ఉన్నారు. వీరికి తాజా గా టెస్టుల‌లో నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఈ ముగ్గురు బిగ్ బాష్ లీగ్ లో శుక్ర‌వారం జ‌ర‌గ‌బోయే తర్వాతి మ్యాచ్ ఆడిలైడ్ స్టైక‌ర్స్ మ్యాచ్ లో పాల్గొంటారు. అయితే ఆట‌గాళ్లు కు, సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకినా.. బిగ్ బాష్ లీగ్ ఎలాంటి అంత‌రాయం లేకుండా కొన‌సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news