ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో దూకుడు చూపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, ఆర్ధిక భరోసా అందించాలి అన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయమందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘జగనన్న చేదోడు’ పథకం పేరుపై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ, ‘ముఖ్యమంత్రి గారు… మీ ప్రభుత్వం తెలుగును ఖూనీ చేస్తుందా? లేక మిమ్ముల్ని అల్లరి చేస్తుందా?’ అని ప్రశ్నించారు. చేదోడు అంటే సహాయం అనే కాకుండా, చేదువాడు అనే అర్థం కూడా వస్తుందని చెప్పారు. “జగనన్న చేదువాడు” అంటే చెడ్డవాడు అనే అర్థం కూడా వస్తుందని ఎద్దేవా చేశారు. ‘ఏమయ్యారు సార్, మీ తెలుగు ప్రపంచ మేధావులు? పేరు మార్చండి’ అని ట్వీట్ చేశారు.