టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలోనే ఆయన టీం పై కేసులను త్వరగా విచారిస్తారని ఆయన పేర్కొన్నారు. దీంతో జగన్ టీంలో కలవరం మొదలైందని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ముఖ్యమంత్రి జగన్ అండ్ టీం పై వున్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్ కాంప్ లో కలవరం మొదలైంది.
ముఖ్యమంత్రి జగన్ అండ్ టీం పై వున్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్ కాంప్ లో కలవరం మొదలైంది. బలమైన సాక్షులు, కీలకమైన ఆధారాలు వున్న విషయం జగన్ కాంప్ కలవరానికి ముఖ్య కారణం. కోర్టులో విచారణ మొదలు కాకుండా ప్రయత్నాలు మొదలు. నిజంకాదా?
— Varla Ramaiah (@VarlaRamaiah) July 6, 2020
బలమైన సాక్షులు, కీలకమైన ఆధారాలు వున్న విషయం జగన్ కాంప్ కలవరానికి ముఖ్య కారణం. కోర్టులో విచారణ మొదలు కాకుండా ప్రయత్నాలు మొదలు. నిజంకాదా?” అని ప్రశ్నించారు. కాగా, మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీకి నిలబడ్డ వర్ల ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.