నాగశౌర్య “వరుడు కావలెను” ట్రైలర్ విడుదల..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు మహిళా దర్శకురాలు సౌజన్య దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సినిమాలో నాగశౌర్య కు జోడిగా రీతువర్మ నటించింది. సినిమాలో నదియా… మురళీశర్మ లాంటి నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు హీరో రానా చేతుల మీదుగా విడుదల చేశారు. కాగా టైలర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో కామెడీ…రొమాన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఎమోషనల్ డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కు ప్లస్ గా నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా వెన్నెల కిషోర్, సప్తగిరి, కిరీటి లాంటి కమెడియన్ లు ఉండటం తో ఆద్యంతం వినోదభరితంగా ఉంది.

https://youtu.be/vAxNeM5gIXg

Read more RELATED
Recommended to you

Latest news