వైసీపీలో వాళ్లిద్ద‌రు ఎందుకు సైలెంట్ అయ్యారు…

-

ఒకప్పుడు వైసీపీలో ఆ ఇద్దరి మహిళా నేతల వాయిస్ ఎంతో ప్రముఖంగా వినిపించేది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు మహిళలు పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించేవారు. వారి బలమైన వాయిస్ ఎదుర్కోవటం ఇతర పార్టీల నేతలకు కూడా కష్టంగా ఉండేది. టిడిపి, జనసేన పార్టీల నుంచి కూడా మహిళా నేత వాళ్లకు కౌంటర్ ఇచ్చేందుకు సాహసించేవారు కాదు. అయితే ఇదంతా గతం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా వినిపించిన ఆ ఇద్దరు నేతలు తెర వెనక్కు వెళ్లి పోయినట్టే కనపడుతోంది.

ఇద్దరు మహిళా నేతలు ఎవరూ కాదు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. రోజా ఎన్నికల్లో విజయం సాధించాక మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అసంతృప్తితో ఉండడంతో జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐ‌ఐసి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినా గానీ ఆమె ఎందుకో గతంలోలా యాక్టివ్ గా ఉండటం లేదు. ప్రతిపక్షాలపై గతంతో పోలిస్తే అంత ఘాటుగా విమర్శలు చేయడం లేదు. ఇక వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ పదవి ఆశించగా ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ పదవితో ఆమె కూడా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ అనుకున్న మంత్రివర్గంలోకి తీసుకున్న మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్లకు కచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉండటంతో పద్మకు ఇవ్వడం కుదరలేదు.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాసిరెడ్డి పద్మ మీడియా లో జగన్ తరఫున ఎంత బలమైన వాయిస్ వినిపించేవారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కూడా అప్పటి అధికార పక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ లతో చెమటలు పట్టించిన మహిళ నేతలు, ఇప్పుడు సైలెంట్ గా ఉండడంతో మీడియాలో వైసీపీ నేతలు టిడిపి నేతలను డిబేట్లో సరిగా ఎదుర్కొనలేక పోతున్నారన్న చర్చలు అయితే ఉన్నాయి.

టిడిపికి నాలెడ్జ్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు వారికి కావలసిన సమాచారం అందుతుంది. వైసీపీకి అలాంటిది లేదు ఎవరికి వారే సొంతంగా హోంవర్క్ చేసి తమ వాదనలు వినిపించాల్సి వస్తుంది. అందరి నాయకుల్లోనూ ఈ సమర్థత లేకపోవడంతో చాలా మంది వైసీపీ నేతలు మీడియా పరంగా ప్రతిపక్షాలకు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు అన్న టాక్ ఉంది. మరి ఇకపై పార్టీ అధిష్టానం పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే నేతలను యాక్టివ్ చేసేలా చేస్తే మంచిదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news