చాలా మంది అందంగా ఉండేందుకు నచ్చినట్లుగా గదులని సర్దుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బెడ్రూం లో మంచం పక్కన ఒక టేబుల్ వేసి అందంగా ఉండడానికి అలంకరిస్తూ ఉంటారు. అయితే మంచం పక్కన సైడ్ టేబుల్ మీద ఎప్పుడూ కూడా ఈ వస్తువులని పెట్టకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటి వలన లేని పోని ఇబ్బందులు వస్తాయని పండితులు చెప్పారు మరి ఎటువంటి వాటిని మనం ఉంచకూడదు అనే విషయాన్ని చూద్దాం.
కొవ్వొత్తులని పెట్టకండి:
వాస్తు శాస్త్రం ప్రకారం మంచం పక్కన టేబుల్ మీద కొవ్వొత్తులని పెట్టకూడదు వాస్తు ప్రకారం మాత్రమే కాకుండా ఇది సేఫ్ కూడా కాదు ఒకవేళ కనుక వీటిని ఉంచితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పెట్టకండి.
మంచినీళ్లు:
మంచినీళ్లు ని కూడా టేబుల్ మీద పెట్టకూడదు మంచం పక్కన చాలా మంది టేబుల్ మీద మంచి నీళ్ళని ఉంచుతారు దీని వల్ల కూడా సమస్యలు కలుగుతాయి కాబట్టి ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి.
ఎండిపోయిన పూలని ఉంచకండి:
ఎండిపోయిన పూలని మంచం పక్క ఉండే టేబుల్ మీద పెట్టకూడదు ఇవి కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.
మెటల్ వస్తువులని పెట్టకండి:
మెటల్ వస్తువులని కూడా మంచం పక్క ఉండే టేబుల్ పక్కన పెట్టకూడదు అలానే మంచం పక్కన గడియారాలు కూడా పెట్టకూడదు. ఇవి ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ని ప్రొడ్యూస్ చేశాయి దీనితో తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కలుగుతాయి.