వాస్తు: తులసి మొక్క వద్ద ఈ తప్పుల్ని మాత్రం చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ వుంటారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి.

ఇంట్లో ఈ విధంగా అనుసరిస్తే ఎంతో మంచి కలుగుతుంది. హిందువులు ప్రతి రోజూ తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని ప్రతి రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయడం.. తులసి మొక్కని పెంచడం చాలా ముఖ్యం. తెలియక కొంత మంది తులసి మొక్క వద్ద కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తులసి మొక్క చుట్టుపక్కల ఎప్పుడు కూడా చెత్త చెదారం ఉండకూడదు అని పండితులు అంటున్నారు. ఒకవేళ కనక తులసి కోట వుండే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దాని వలన లక్ష్మీదేవి కి కోపం వస్తుందట.
అలానే చీపురుకట్టను తులసి మొక్క దగ్గర పెట్టకూడదు ఇది కూడా అస్సలు మంచిది కాదు. తులసి మొక్క దగ్గర చీపురుకట్టను ఉంచడం వల్ల ఇంట్లో ధనం నిలవదు పేదరికం వస్తుంది.
అదే విధంగా తులసి మొక్క దగ్గర చెప్పుల స్టాండ్ వుండకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది. సమస్యలను కలిగిస్తుంది కాబట్టి అస్సలు తప్పులు చేయకుండా ఉండండి లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news