వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు. నిజానికి వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి వాటి కోసం చూసేద్దాం.
త్వరలో హోలీ పండుగ రాబోతుంది. హోలీని ఆడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలని అనుసరిస్తే సమస్యల నుండి బయట పడి ఆనందంగా ఉండడానికి అవుతుంది అలానే మీ ఇంట్లో అదృష్టం కూడా కలుగుతుంది. ఇక మరి ఎటువంటి చిట్కాలను పాటించాలి అనే విషయాన్ని చూసేద్దాం.
రాధాకృష్ణులకి కచ్చితంగా మొదట పూజించాలి:
రాధాకృష్ణుడితో హోలీ పండుగ మొదలవుతుంది. హోలీ పండగ అంటే రంగుల పండగ. అయితే ఈ పండుగ నాడు రాధాకృష్ణులని పూజించడంతో మొదలవుతుంది. హోలీ పండగ నాడు కచ్చితంగా రాధాకృష్ణులని పూజించాలి. రంగులు రాసుకునే ముందు రాధాకృష్ణులకి ముందు రంగులని అర్పించి ఆ తర్వాత మాత్రమే ఆడుకోవాలి. హోలీ సెలబ్రేషన్స్ ని మొదలుపెట్టే ముందుకు రాధాకృష్ణులకి కచ్చితంగా మొదట పూజించాలి.
మీ పేరుని ముఖద్వారం వద్ద రాయండి:
మీ ఇంట అదృష్టం రావాలంటే ఇంటి ముఖ ద్వారం మీద మీ పేర్లను రాసుకోండి. ఇది పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. అదృష్టాన్ని కూడా తొలగిస్తుంది. అలానే మీ ముఖద్వారం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ముఖద్వారం దగ్గర దుమ్ము ధూళి ఉండకూడదు. ఎంత అందంగా ముఖద్వారం ఉంటే మీ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది.
వినాయకుడికి వీటిని నైవేద్యంగా ఇవ్వండి:
హోలీ నాడు వినాయకుడికి చల్లటి పాలల్లో డ్రై ఫ్రూట్స్ వేసి నైవేద్యం పెట్టండి అలానే స్వీట్స్ ని కూడా వినాయకుడికి పెట్టండి ఇలా మీరు ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకొని ఆచరిస్తే ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది ఆనందంగా మీరు ఉండగలరు.