వాస్తు: ఉదయం లేవగానే మర్చిపోయి కూడా వీటిని చూడద్దు..!

-

వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఎంతో మేలు కలుగుతుంది. ఈరోజు వాస్తు పండితులు ఉదయం లేవ గానే వీటిని అస్సలు చూడొద్దని అంటున్నారు. మరి వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం..

 

ఉదయం లేవగానే ఎంత ఫ్రెష్ గా ఉంటే రోజు అంతా కూడా అంత ఫ్రెష్ గా ఉంటుంది. కనుక ఉదయం లేచేటప్పుడు మంచిగా, ఆనందంగా ఉండడం మంచిది. అయితే రోజంతా మంచి జరగాలంటే తప్పకుండా ఉదయం పూట వీటిని చూడొద్దని అంటున్నారు.

వీటిని చూడటం వల్ల రోజు అంతా కూడా ఇబ్బందులు వస్తాయి. మరి అవేమిటి..?, వాటిని చూడడం వలన ఏం అవుతుంది..? అనే విషయాలని మనం తెలుసుకుందాం.

పనిచేయని గడియారం:

వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే పని చేయని గడియారం వైపు చూడకూడదని చెబుతున్నారు. వాటిని ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదని పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి వాటి వైపు ఉదయం లేవగానే చూడొద్దు అలానే వాటిని ఇంట్లో ఉంచొద్దు.

కడగని సామాన్లు:

ఉదయం లేవగానే తినేసిన ప్లేట్లని కడగకుండా వదిలేసిన సామాన్లుని చూడటం మంచిది కాదు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. కడక్కుండా సామాన్లు రాత్రంతా వదిలేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news