మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక మీరు మీ ఇంట్లో ఆచరిస్తే తప్పకుండా ఇంట్లో సమస్యలేమీ లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
మన ఇంట్లో ఉండే నలుపు రంగు వస్తువుల గురించి ఈరోజు పండితులు చెప్పారు. అయితే నలుపు రంగు వస్తువులు ఏ దిక్కున ఉంటే మంచిది…? ఏ దిక్కున ఉంటే మంచి జరగదు అనేది చూద్దాం. చాలా మంది పెట్స్ ని పెంచుకుంటూ వుంటారు. మీ ఇంట్లో ఒకవేళ నల్ల కుక్క ఉంది అంటే దానిని మీరు ఇంట్లో పెట్టాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం దానిని ఉత్తరం దిక్కు లో ఉంచటం మంచిదని పండితులు చెప్పారు.
అలానే డాగ్ హౌస్ కూడా ఉత్తర దిక్కున ఉంటే మంచిది. అంతే కాకుండా నల్లటి వస్తువులు ఏమున్నా సరే ఉత్తరం వైపు పెట్టుకోండి ఇలా నల్లటి వస్తువులుని ఉత్తరం వైపు పెట్టడం వల్ల చెవికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే వాస్తు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఇంట్లో ఈ విధంగా మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మంచి కలుగుతుంది. అలానే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.