వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. చాలామంది వాస్తు ప్రకారం అనుసరించి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి చూస్తూ ఉంటారు. మీరు కూడా ఏ తప్పు ని చేయకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారా..? వాస్తు సమస్యలు కలగకుండా ఉండాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ తప్పును చేయకండి. ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
వాస్తు ప్రకారం వాడిపోయిన పూలని ఇంట్లో ఉంచుకోకూడదు. చాలా మంది పూలని అలంకరణగా పెడుతుంటారు. నిజానికి పూలని ఇంట్లో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అదే వాడిపోయిన పూలు పెడితే ఏమవుతుంది దీనికి రివర్స్ అవుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ పోయి నెగటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడికి పెట్టిన పూలని కానీ ఇంట్లో అలంకరణకు పెట్టిన పూలని కానీ విడిపోకుండా చూసుకోండి.
తాజా పూలని పెట్టిన తరవాత రోజుని తొలగించండి వాడిపోయిన పూలని ఇంట్లో ఉంచడం వలన బాధల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. తాజా పూలని ఇంట్లో పెడితే లక్ష్మీదేవి ఉంటుంది కానీ వాడిపోయిన పూలని ఇంట్లో ఉంచడం వలన కష్టాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ తప్పును చేయకండి. ఈ తప్పులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది అలానే ఆర్థిక భాదలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.