వాస్తు: ధనం, ఆనందం ఉండాలంటే కచ్చితంగా వీటిని పాటించండి..!

-

వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని ఇలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ధనం పెరుగుతుంది. ఆర్ధిక బాధలు వుండవు. అలానే ఆనందంగా ఉండేందుకు కూడా అవుతుంది.

వాస్తు ప్రకారం ధన నష్టం కలగకుండా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా ఇలా చేయాల్సిందే. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తలుపులని కిటికీలని తెరిచి ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే మంచి గాలి వెల్తురు కూడా వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారం వంటివి పూజ గదిలో ఉండకూడదు.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కర్పూరం వెలిగించాలి ఇది కూడా నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ప్రశాంతతను కూడా ఇస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపున ఒక గ్లాసు మంచి నీళ్లు పెడుతూ ఉండాలి. అలానే పండితులు ఇంట్లోకి చెప్పులు వేసుకు రాకూడదని చెబుతున్నారు. ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ వేయాలి. ఇది పిండి లేదా పసుపుతో వేయొచ్చు. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలానే మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉండేందుకు కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news