గ్రాఫిక్ వర్క్ కోసం ఎక్కడికో పోయేది లేదు లోకల్..!!

-

యంగ్  హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ  తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. . ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి వ్యూస్ సాధిస్తోంది. చాలా మంది నుండి ప్రశంశలు వస్తున్నాయి. ఇక”హను-మాన్” సినిమా టీజర్ పై  గ్రాఫిక్స్ లేని కాలంలోనే ఆదిత్య 369 వంటి సూపర్ హిట్ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు

ఇక ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ ఆదిపురుష్ సినిమా క్వాలిటీ తో పోలుస్తూ. చాలా మంది డబ్బు ఉంటేనే కాదు, కంటెంట్ మరియు కమిట్ మెంట్ ఉండాలని దొమ్మెత్తి పోశారు.అసలే గ్రాఫిక్స్ బాగా లేక క్వాలిటీ కోసం విడుదలను వాయిదా వేసుకున్న వారిని రీసెంట్ గా ఒక యూట్యూబర్ అలాగే సీన్లు తీసి ఈ సినిమా కు 500 అవసరమా అని అడిగేలా చేసాడు. దీనితో ఆదిపురుష్ సినిమా పై ఇంకా విమర్శలు ఎక్కువ అయ్యాయి .

ఇక ఈ సినిమా టీజర్‌ కు అద్బుత మైన కామెంట్స్ వస్తున్న వేళ మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది. “వి.ఎఫ్.ఎక్స్”. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న  గ్రాఫిక్స్  వర్క్ చేసింది, మన హైదరాబాద్ కు చెందిన “హేలో హ్యూస్ స్టూడియోస్” సంస్థ. అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో గ్రాఫిక్స్ వర్క్ చేసి ఇచ్చారట. దీంతో ఈ గ్రాఫిక్స్‌ కంపెనీ కాంటాక్ట్ కోసం చాలా మంది టాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు వెతుకుతున్నారట.తమ సినిమా కోసం వారితో అగ్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news