వాస్తు: ఈ విధంగా మార్పులు చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది..!

-

కొంత మంది పిల్లలు చదువు పట్ల అస్సలు ఆసక్తి పెట్టలేరు. అయితే అలాంటి వారి ఏకాగ్రత పెరిగి చదువుపై శ్రద్ధ పెట్టాలంటే ఈ మార్పులు చేయడం మంచిదని పండితులు అంటున్నారు. మీ పిల్లలు కూడా చదువు పట్ల ఆసక్తి పెట్టలేరా..?, మీరు వాళ్ళ యొక్క ఏకాగ్రతని పెంచాలనుకుంటున్నారా…? అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరిస్తే సరి.

 

ఈ విధంగా కనుక మీరు ఇంట్లో మార్పులు చేస్తే కచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవడానికి వీలవుతుంది. ఇక వాటి కోసం చూస్తే… మీ పిల్లలు చదువు పట్ల అసలు ఫోకస్ పెట్టలేక పోతే వాళ్ళ యొక్క స్టడీ రూమ్ ని మార్చండి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే ఈ మార్పు చేయాలని అస్సలు మర్చిపోకండి. వాస్తు ప్రకారం మార్పులు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది దానితో చదువులో కూడా బాగా రాణించగలరు.

ఎప్పుడూ కూడా పిల్లలు చదువుకునే రూమ్ వేరేగా ఉండాలి. చదువుకునే ఆ రూమ్ లో ఎప్పుడూ కూడా మంచిగా డెకరేషన్ ఉండాలి. దీనితో పిల్లలు పూర్తిగా ఆసక్తి చూపగలరు. అలానే రంగులు కూడా ఆకర్షణీయంగా బాలెన్స్డ్గా ఉండాలి. బాగా బ్రైట్ గా ఉండే కలర్స్ వేయడం అస్సలు మంచిది కాదు. అయితే రంగు కాస్త బ్రైట్గా ఉన్నా… లైట్ గా ఉంటేనే మంచిది. ఉదాహరణకు స్టడీ రూమ్ లో నిమ్మ రంగు వేస్తే బాగుంటుంది. సీలింగ్ అయితే తెలుపు లేదా క్రీమ్ కలర్ బాగుంటుంది. ఇలా స్టడీ రూమ్ లో ఈ రంగులు వేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version