తిరుమల లడ్డూపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా..? హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ్టీ నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసమో నేను ఈ దీక్ష చేపట్టడం లేదన్నారు. స్వామి వారి పూజా విధానాలు మార్చేశారని.. శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆగ్రహించారు.
వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని బాంబ్ పేల్చారు. ఏ మతమైనా కావచ్చు ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బ తినకూడదని కోరారు. ప్రసాదాల్లో కల్తీ జరుగుతోంది.. నాణ్యత లేదని ముందు నుంచీ చెబుతున్నామని తెలిపారు. టీటీడీపై వైట్ పేపరు రావాలని కోరుకున్నామని చెప్పారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదన్నారు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారని… రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటోందని తెలిపారు. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని…ఆ రోజు రాజకీయం చేయలేదని తెలిపారు.