కూకట్‌ పల్లిలో హైడ్రా కూల్చివేతలు..కన్నీరు మున్నీరు గా విలపిస్తున్న బాధితులు

-

కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు హైడ్రా బాధితులు. ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి? మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన అంటూ ఓ మహిళా బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. మంచి చేస్తావ్‌ అనుకుంటే.. ఇట్లా చేస్తావ్ అనుకోలేదని… మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు హైడ్రా బాధిత మహిళ.

Hydra demolishing constructions at Kukatpally Nalla Cheruvu

కాగా, తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది… భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని..నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు..ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడి చేరుకుని.. కూల్చివేస్తున్నారు అధికారులు. అమీన్ పూర్ లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version