వాస్తు: కుబేరుడు విగ్రహం ఎటువైపు ఉంటే మంచి కలుగుతుందో తెలుసా..?

-

సాధారణంగా చాలా మంది కుబేరుడు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అంటారు. ఎక్కడ అయితే ఈ విగ్రహం ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కుబేరుడు విగ్రహం గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడు విగ్రహం ఎటు వైపు ఉండాలి అనేది చూద్దాం..! మామూలుగా
ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కుబేరుడు విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. కానీ ఎంత ఎత్తులో పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు. ఎప్పుడూ కూడా 30 ఇంచుల కంటే ఎత్తులో ఉంచాలి అది కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండాలి. 30 ఇంచులు దాటి ఉంచితే మంచిదని పండితులు చెబుతున్నారు. అలానే 32 ఇంచులు కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదట.

ఇది ఇలా ఉంటే కుబేరుడి ముఖం ఎప్పుడూ కూడా ముఖ ద్వారానికి ఎదురుగా ఉండాలి. అంటే ఎప్పుడైతే ఇలా ద్వారాన్ని తెరుస్తారో అప్పుడు వెంటనే ఈ విగ్రహం కనిపించాడట. అలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా పెట్టడమే సరైన పద్ధతి అని పండితులు చెప్తున్నారు.

అలానే ఎప్పుడూ కూడా కుబేరుడు విగ్రహాన్ని వంటింట్లో పెట్టకూడదు. అదే విధంగా డైనింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో కూడా పెట్టుకో కూడదు అని పండితులు చెప్తున్నారు. చాలా మంది బెడ్ రూమ్, డైనింగ్ రూమ్ లో కూడా పెడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు అలానే కుబేరుని విగ్రహానికి పూజలు కూడా చేయకూడదని పండితులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news