వాస్తు: భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి భార్య భర్తలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే భార్య భర్తల మధ్య సమస్యలే ఉండవట. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి.
భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు మంచిది కాదు. దీనివలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం షింక్ మరియు స్టవ్ ఒకే దిక్కున ఉండకూడదు. ఎప్పుడు కూడా నీళ్లు నిప్పు వేరుగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది ఇలా భార్యాభర్తలు వీటిని అనుసరిస్తే సమస్యలు ఉండవు చక్కగా ప్రేమ అనురాగాలని పెంపొందించుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ప్రేమానురాగాలని పెంచుకోండి.